రేపే లైగర్‌ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే...

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన లైగర్‌ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. రేపు (శనివారం) సాయంత్రం 5 గంటలకు గుంటూరులో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు నిర్మాతలలో ఒకరైన ఛార్మీ కౌర్ ట్విట్టర్‌ ద్వారా తెలియజేసారు. స్థానిక చ‌ల‌ప‌తి ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ గ్రౌండ్స్‌లో ఈ వేడుక నిర్వహించబోతున్నట్లు తెలిపారు. 

గత రెండు వారాలుగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే, లైగర్‌ చిత్ర బృందం కలిసి దేశమంతా చుట్టేస్తూ ప్రమోషన్స్‌తో హోరెత్తించేస్తూ సినిమాకు చాలా హైప్ క్రియేట్ చేశారు. దీంతో ఈ సినిమాపై చాలా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా నటించారు. కనుక సినీ అభిమానులు అందరూ లైగర్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. లైగర్‌ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి ఆగస్ట్ 25న విడుదల కాబోతోంది.