
మెగాస్టార్ చిరంజీవితో భారీ సినిమాలను నిర్మించిన క్రెడిట్ అశ్వనిదత్ కు ఉంది. వైజయంతి బ్యానర్లో ఆయన చిరంజీవితో నిర్మించిన భారీ సినిమాలన్ని ఓ రేంజ్లో ఆడాయి. అయితే ప్రస్తుతం అశ్వనిదత్ తన ప్రొడక్షన్ నుండి సినిమాలు తీయడం ఆపేశారు. ఇక చిరు రీ ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి చిరుతో 151వ సినిమా ప్రొడ్యూస్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే బోయపాటి శ్రీను చిరు 151 కోసం కథ సిద్ధం చేశాడని అంటున్నారు.
ఆ మూవీ అశ్వనిదత్ నిర్మాణ సారధ్యంలో రాబోతుందట. అసలైతే చిరు 151వ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో నటించాల్సి ఉంది. ఎలాగు అశ్వనిదత్ కూడా తన ఓన్ బ్యానర్ లాంటిదే కాబట్టి అల్లు అరవింద్ కూడా అశ్వనిదత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సరైనోడు హిట్ తో బోయపాటి శ్రీను మీద నమ్మకంతో ఉన్న చిరంజీవి తన తర్వాత సినిమాకు తానే సరైన దర్శకుడు అని సెలెక్ట్ చేశాడని తెలుస్తుంది.
ఇక ప్రస్తుతం చేస్తున్న ఖైది నెంబర్ 150 మూవీ దాదాపు 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సంక్రాంతి బరిలో దిగనున్న ఈ సినిమా డిసెంబర్ కల్లా ఫినిష్ చేసి ఓ రేంజ్లో ప్రమోట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.