టీజర్ తో భయపెట్టించాడు..!

యువ హీరోల్లో నిఖిల్ పంథా వేరు. కొత్త కథలతో ముందుకొస్తున్న నిఖిల్ రిజల్ట్ కూడా అదే రేంజ్లో అందుకుంటున్నాడు. శంకరాభరణం సినిమాతో అంచనాలను అందుకోలేకపోయిన నిఖిల్ ప్రస్తుతం ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో రాబోతున్నాడు. విఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే హైప్ క్రియేట్ చేసింది. ఇక నిన్న రిలీజ్ అయిన టీజర్ అందరిని షాక్ అయ్యేలా చేసింది. మరణం తర్వాత బరువు 21 గ్రాములు తగ్గడం ఆ బరువు ఎవరిది ఆత్మదా..? అంటూ చాలా ఎక్సయిట్మెంట్ ఏర్పడేలా చేసిన ఈ టీజర్ ఓ రకంగా ఆడియెన్స్ ను థ్రిల్లింగ్ చేసింది. 

అంచనాలే లేని ఈ సినిమాపై ఆనంద్ ఓ రేంజ్లో టీజర్ వదిలి వారెవా అనిపించేలా చేశాడు. ప్రస్తుతం తుది దశకు చేరుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. నిఖిల్ లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. హీరోయిన్ హెబ్భా పటేల్ క్యూట్ లుక్స్ తో అదరగొట్టింది. మరి టీజర్ తో భయపెట్టి ఆడియెన్స్ మెప్పు పొందిన ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి. కొత్త ఆలోచనతో కొత్త ఉత్సాహంతో సినిమాలు చేస్తున్న యువ హీరోలకు ప్రేక్షకులు కూడా తమ సపోర్ట్ ఇస్తున్నారు.