ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న సలార్ చిత్రం రిలీజ్ డేట్ ఖరారు అయ్యింది. 2023, ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ఈ సినిమాను నిర్మిస్తున్న హోంభలే ఫిల్మ్స్ ట్విట్టర్‌లో ప్రకటించింది. దీంతో ఈ చిత్రానికి సంబందించి ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది. దానిలో ప్రభాస్ రెండు చేతులతో రెండు కత్తులు పట్టుకొని ఎవరితోనో ఫైటింగ్ చేస్తున్నట్లుంది.  ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో జగపతి బాబు, ఈశ్వరీరావు, మధు గురుస్వామి, పృధ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.  

ఇది కాక బాలీవుడ్‌ దర్శకుడు ఓం రవుత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిగా పౌరాణిక పాత్ర (శ్రీరాముడు)గా నటిస్తుండటంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కృతి సనన్ సీతాదేవిగా, సైఫ్ ఆలీ ఖాన్ రావణుదిగా, దేవదత్త నాగే హనుమంతుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా 2023, జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ రెండు కాక స్పిరిట్, ప్రాజెక్ట్-కె అనే మరో రెండు సినిమాలు చేస్తున్నాడు.