
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా చేసిన పుష్ప-ది బిగినింగ్, చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 ది రైజింగ్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఓ కొత్త విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో రష్మిక మందనకు బదులు కొత్త హీరోయిన్ వస్తుందని తెలుస్తోంది. ఆమె నటించిన శ్రీవల్లి పాత్ర చనిపోతుందని, తర్వాత అడవులలో నివశించే గిరిజన యువతితో పుష్ప రాజ్‌కు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుందని తెలుస్తోంది. ఆ గిరిజన యువతిగా సాయి పల్లవి నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఆమె తెరపై కేవలం 20 నిమిషాలే కనిపిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని చిత్ర బృందం ఇంకా దృవీకరించవలసి ఉంది.
ప్రస్తుతం దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, పాటల రచయిత చంద్ర బోస్ ముగ్గురూ విదేశాలలో మ్యూజిక్ సిటింగ్స్‌లో ఉన్నారు. ఇప్పటికీ పుష్ప-2 స్క్రిప్ట్ సిద్దంగా ఉన్నందున ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. బహుశః ఈ నెలాఖరులోగా పుష్ప-2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.