
పది సంవత్సరాల క్రితం కమర్షియల్ సినిమాల హవా కొనసాగుతున్న తరుణంలో ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బొమ్మరిల్లుతో సూపర్ హిట్ అందుకుని తెలుగు సినిమాలో ఓ కొత్త ట్రెండ్ సృష్టించాడు బొమ్మరిల్లు భాస్కర్. ఆ సినిమా తర్వాత అదే తరహా సినిమాలు ఎన్నో వచ్చాయి. అయితే ఆ హిట్ తో పరుగు తీసి పర్వాలేదు అనిపించుకున్న భాస్కర్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో తీసిన ఆరెంజ్ ఫ్లాప్ అవడంతో అపవాదాలు మూటకట్టుకున్నాడు.
ఆ తర్వాత ఒంగోలు గిత్త తీసినా అది అలానే పోయింది. ఇక తర్వాత చిన్నగా కోలీవుడ్ బాట పట్టిన భాస్కర్ అక్కడ కూడా అంతగా క్లిక్ అవ్వలేదు. రీసెంట్ గా బెంగుళూరు డేస్ రీమేక్ గా తమిళంలో తీసినా అది నిరాశ పరచడంతో మళ్లీ టాలీవుడ్ మీద ఆశ పెంచుకున్నాడు. దాదాపు రెండు సంవత్సరాలుగా అల్లు అరవింద్ తో కథా చర్చల్లో పాల్గొంటున్న భాస్కర్ ఫైనల్ గా ఆయంతో సినిమా ఓకే చేయించుకున్నాడట. నాగ చైతన్య హీరోగా చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది.
సో మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత మళ్లీ బొమ్మరిల్లు డైరక్టర్ కు తన టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. ప్రేమం హిట్ తో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించిన చైతన్యతో భాస్కర్ ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి.