
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ రీసెంట్ గా అక్కడ విజయ ఢంఖా మోగించిన సినిమా పులి మురుగన్.. రిలీజ్ అయిన వారంలోనే 35 కోట్ల కలక్షన్స్ తో మలయాళంలో ఓ సరికొత్త సంచలనాలను క్రియేట్ చేస్తున్న ఆ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వైషాఖ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన పులి మురుగన్ సినిమా తెలుగులో మన్యం పులిగా రానుంది.
సింధూరపువ్వు కృష్ణారెడ్డి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మనమంతా, జనతా గ్యారేజ్ సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ దక్కించుకున్న మోహన్ లాల్ ఇప్పుడు ఈ మన్య పులితో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. అక్కడ ఎలాగు హిట్ కాబట్టి తెలుగు ప్రేక్షకులకు నచ్చే అవకాశాలు ఉన్నాయి. కమిలిని ముఖర్జు హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు విలన్ గా నటించారు. అడవిలో నివసించే యోధుడి పాత్రలో మోహన్ లాల్ నటనకు మలయాళంలో ప్రభజనం సృష్టిస్తుంది. మరి తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.