విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఇంకా విడుదల కాకమునుపే సినిమా ప్రమోషన్స్‌తో యావత్ దేశాన్ని ఉర్రూతలూగిస్తుంటే, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి చక్కటి సినిమాతో హిట్ కొట్టిన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హైవే అనే సినిమాతో వచ్చేస్తున్నాడు. 118, WWW వంటి విన్నోతమైన కధాంశాలతో మంచి పేరు సంపాదించుకొన్న కేవి గుహన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను ఈ నెల 19 నుంచి ఆహా ఓటీటీలో నేరుగా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఆ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రంలో సత్యా, అభిషేక్ బెనర్జీ, సైయామీ ఖేర్ ముఖ్యపాత్రలు చేశారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై వెంకట్ తలారి నిర్మించిన హైవేకు సిమోన్ కింగ్ సంగీతం అందించారు.