
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైది నెంబర్ 150 సినిమాలో మెగా స్టెప్పులు కూడా ప్లాన్ చేస్తున్నారట. ఫ్యాన్స్ ను ప్రత్యేకంగా అలరించే స్టెప్పులతో అదరగొట్టే చిరు సినిమాలో ఫ్యాన్స్ కోసం స్పెషల్ మూమెంట్స్ చేస్తున్నారట. దీని కోసం చాలా కష్టపడుతున్నారట కూడా. ఇప్పటికే చిరు కపోజర్స్ గా ప్రభుదేవ, లారెన్స్ మాస్టర్స్ రంగంలో దిగారు. అయితే మెగా మూవీలో మిగతా హీరోల సందడి ఎలా ఉండబోతుంది. ఎవరెవరు మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు అన్న దాని మీద పెద్ద డిష్కషనే జరుగుతుంది.
మెగా హీరోలంతా కనబడతారని ఓ పక్క వార్తలు వస్తుంటే మరో పక్క కేవలం చరణ్ మాత్రమే కనిపిస్తాడు అంటున్నారు. ఎవరెరు ఉన్నా లేకున్నా మెగా పవర్ స్టార్ రాం చరణ్ మాత్రం మెగాస్టార్ తో స్టెప్పులేస్తున్నాడట, ఓ పాటలో చెర్రి అలా సర్ ప్రైజ్ ఇస్తాడని టాక్. అది కూడా లారెన్స్ మాస్టర్ డ్యాన్స్ కంపోజింగ్ లో వస్తున్న సాంగ్ లోనే చరణ్ స్పెషల్ ఎట్రాక్షన్ ఉంటుందని అంటున్నారు. మగధీర టైంలో చరణ్ కోసం చిరు ఓ సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి పాటలో స్టెప్పులేశారు. ఇప్పుడు అదే రేంజ్లో చిరు కోసం చరణ్ కూడా కాలు కదుపుతున్నాడట. మరి ఒకే స్క్రీన్ పై ఒకే సాంగ్ కు చిరు చరణ్ డ్యాన్స్ చేస్తే ఆ కిక్ ఎంజాయ్ చేసేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు.