
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే మెగా హీరోల్లో సెపరేట్ క్రేజ్.. మెగా అభిమానుల్లో ప్రత్యేకంగా చరణ్ తర్వాత బన్ని అదే రేంజ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు అఫ్కోర్స్ బన్నికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందనుకోండి. తన ప్రతి సినిమాతో అభిమానులను సర్ ప్రైజ్ చేసే అల్లు అర్జున్ ప్రస్తుతం దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తున్నాడు. త్వరలో షూటింగ్ స్టార్ట్ అవనున్న ఈ సినిమా హరీష్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత బన్ని ఓ రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట.
అసలైతే బన్ని తన కెరియర్ లో ఇప్పటిదాకా రీమేక్ ల జోలికి పోలేదు. మొదటిసారి బన్ని ఓ కన్నడ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. కన్నడలో బద్మాష్ సినిమా చూసిన బన్ని దానిపై మనసు పడ్డాడట. ఎలాగైనా ఆ సినిమా తెలుగులో తాను రీమేక్ చేయాలని చూస్తున్నాడట. బన్ని మెచ్చాడంటే కచ్చితంగా సినిమాలో విషయం ఉండే ఉంటుంది. మరి ఆ సినిమా రీమేక్ కన్నడ దర్శకుడే డైరెక్ట్ చేస్తాడా లేక ఇక్కడ వారికి ఛాన్స్ ఇస్తాడా అన్నది బన్ని నిర్ణయించుకోవాల్సి ఉంది.
వరుస హిట్లతో ఫుల్ ఫాంలో ఉన్న బన్ని హిట్ సినిమా అంటే ముందే కర్చీఫ్ వేస్తున్నాడు. ఈ సమ్మర్ లో సరైనోడుతో సూపర్ హిట్ అందుకున్న బన్ని డిజెను కూడా అదే రేంజ్ హిట్ అయ్యేలా కష్టపడుతున్నాడట. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న డిజెకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.