ఎంఎస్ రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో నితిన్, కృతిశెట్టి జంటగా చేస్తున్న మాచర్ల నియోజకవర్గం చిత్రం ఆగస్ట్ 12వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ఈనెల 30వ తేదీన విడుదల కాబోతోంది కానీ ఈలోగా ‘మాచర్ల ధమ్కీ’ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది ఆ చిత్ర బృందం.
“మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం లక్షలాదిమంది తమ సమాధులను పునాదులుగా వేశారు. మాచర్ల నియోజకవర్గంలో ధర్మాన్ని కాపాడటం కోసం నా సమాధిని పునాదిగా వేయడానికి నేను సిద్ధం...” అంటూ నితిన్ పవర్ ఫుల్ డైలాగ్ చాలా ఆకట్టుకొంటుంది. ఈ సినిమాలో నితిన్ సిద్ధార్థ్ రెడ్డి అనే పోలీస్ ఆఫీసరుగా నటిస్తున్నాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆకెళ్ళ రాజ్ కుమార్ సమర్పకుడు. సంగీతం మహతి స్వర సాగర్.