త్రివిక్రమ్ సినిమాలో మహేష్ బాబు డబుల్ రోల్?

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌- మహేష్ బాబు కాంబినేషన్‌లో సినిమా ఆగస్ట్ రెండో వారంలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. గతంలో వారి కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మళ్ళీ 19 ఏళ్ళ తరువాత వారిరువురూ కలిసి ఈ సినిమా చేయబోతున్నారు కనుక ఈ సినిమాపై చాలా భారీ అంచనాలు ఉంటాయి. 

ఇప్పుడు ఆ సినిమాకు సంబందించి మరో ఆసక్తికరమైన వార్త వినపడుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారిగా రెండు పాత్రలు (డబుల్ రోల్) చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మహేష్ బాబు అనేక సినిమాలు చేశాడు కానీ డబుల్ రోల్ ఉన్న సినిమా ఒక్కటీ చేయలేదు. కనుక ఇదే నిజమైతే మహేష్ బాబు అభిమానులకు పండగే. 

ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా పూజ హెగ్డేని ఖరారు చేశారు. ఒకవేళ డబుల్ రోల్ చేస్తున్నట్లయితే మరో హీరోయిన్ కావాల్సి ఉంటుంది. 

హారిక అండ్ హాసిని బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మించబోతున్న ఈ సినిమాకు సంగీతం తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఫైట్స్ రామ్, లక్ష్మణ్. 

ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమాకి ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి28గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను 2023 వేసవిలో విడుదల చేయబోతున్నట్లు  చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ఈ సినిమాలో ఇతర నటీనటుల గురించి ఇంకా తెలియవలసి ఉంది.