విన్నర్ గా మెగా హీరో...!

మెగా హీరోల్లో మంచి దూకుడు తనం ప్రదర్శిస్తున్న మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ కెరియర్ లో తీసిన ఐదారు సినిమాలకే మెగా ఫ్యాన్స్ లో ఓ మంచి ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నాడు. మెగా స్టైల్ తో మామల మేనరిజాలంతో మస్త్ జబదస్త్ జోష్ పంచుతున్న సాయి ధరం తేజ్ ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక దానికి టైటిల్ గా ముందు ఏవేవో అనుకోగా ఫైనల్ గా విన్నర్ అని పెట్టారు.

ఫస్ట్ లుక్ మాత్రమే కాదు విన్నర్ గా తేజు మరోసారి అదరగొట్టాడు. ఈరోజు బర్త్ డే స్పెషల్ గా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చిన తేజు ఫస్ట్ లుక్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో అదే రేంజ్లో సినిమాను కూడా ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు. పక్కా మాస్ మసాల సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన మెగా ఫ్యామిలీ నుండి ఈతరం ప్రేక్షకులను అతి త్వరగా ఆకట్టుకున్న సాయి ధరం తేజ్ మరో మాస్ మహారాజ్ అనడంలో తప్పేమి లేదు.  

ఈ ఇయర్ సుప్రీం హిట్ ఓ జోష్ ఫుల్ గా కనిపించిన తేజు ఆ తర్వాత వచ్చిన తిక్కతో కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపించాడు కాని మళ్లోసారి బాక్సాఫీస్ దగ్గర తాను విన్నర్ గా గెలవడానికి వస్తున్నాడు. నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.