
ఇటీవల అచ్చమైన తెలుగు పేర్లతో, మన సొంత యాసలతో చక్కటి సినిమాలు వస్తున్నాయి. అటువంటిదే రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా. రాజమండ్రి కాలేజీలో చదువుకొనే ఓ యువతీయువకుల ప్రేమకధను కోనసీమ, గోదారి అందాల నేపద్యంతో జోడించి చూపబోతున్నామని దర్శకుడు నాని బండ్రెడ్డి చెప్పారు. జై జాస్తి, ఆనంతిక ఈ సినిమాతో హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. దీనిలో వెన్నెల కిషోర్, ప్రవీణ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
నిర్మాతలు డి. సురేష్ బాబు, ప్రదీప్ ఉప్పలపాటి, బ్యానర్: సురేశ్ ప్రొడక్షన్స్, సంగీతం: గోవింద్ వసంత, యశ్వంత్ నాగ్, భారత్, సౌరబ్, అజయ్ ఆరసడ; కెమెరా: జి.ముఖేష్, శక్తి అరవింద్, పాటలు: భువనచంద్ర, అనంత్ శ్రీరామ్.
ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి, తరువాత వైజాగులో జరుగుతుంది. ఈ రాజమండ్రి రోజ్ మిల్క్ ను ఈ ఏడాది దసరా, దీపావళి పండుగ సీజనులో ప్రేక్షకులకు రుచి చూపించబోతున్నామని దర్శకుడు నాని బండ్రెడ్డి చెప్పారు. ఈ సినిమా టైటిల్ సాంగ్ ఈరోజు విడుదలైంది.
#RajahmundryRoseMilk title song is out.
Full Song: https://t.co/GcQZ5dYXZm @arasadaajay @boselyricist @anuragkulkarni_
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️@SureshProdns @introupe_films #PradeepU pic.twitter.com/Qa2GhSEyT9