నేను సంతోషంగా లేను: రజనీకాంత్

రజనీకాంత్... పరిచయమే అవసరంలేని పేరు. దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యంగా తమిళనాడులో ఆయనను దేవుడిగా పూజించే అభిమానులు లక్షల్లో ఉన్నారు. సినీ నటుడిగా ఆయన సంపాదించిన ఆస్తులు, కీర్తిప్రతిష్టలు ఎనలేనివి. కానీ అవన్నీ నాకు సంతోషాన్ని ఇవ్వలేకపోయాయని, తాను సంతోషంగా లేనని రజనీకాంత్ స్వయంగా చెప్పారు. 

ఇటీవల చెన్నైలో ‘హ్యాపీ సక్సస్ ఫుల్ లైఫ్ త్రూ క్రియా యోగా’ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు రజనీకాంత్ ఈవిషయం చెప్పారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఇప్పటివరకు నేను నటించిన సినిమాలలో బాబా, రాఘవేంద్ర చిత్రాలు మాత్రమే నాకు ఆత్మ సంతృప్తినిచ్చాయి. వాటితోనే నాకు ఇద్దరు సద్గురువుల గురించి తెలుసుకోగలిగాను. ఆ తరువాత నా జీవనవిదానం, ఆలోచనధోరణిలో చాలా మార్పు వచ్చింది. ఆ రెండు సినిమాల ప్రభావంతో నా అభిమానులలో ఇద్దరు సన్యాసం స్వీకరించారు. కానీ నేను ఇంకా వివిద కారణాలతో సినిమాలలో నటిస్తూనే ఉన్నాను. ఈ డబ్బు, ఆస్తులు, కీర్తిప్రతిష్టలు అశాశ్వితమైనవని తెలుసు. కానీ ఈ వలయంలో నుంచి బయటపడి సంతోషంగా జీవించలేకపోతున్నాను,” అని అన్నారు.