సెవెంటీన్ ఇండస్ట్రీస్ ఇక్కడ...?

‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ..’ అనగానే టక్కున నటుడు పృధ్వీ గుర్తుకు వస్తారు. ఇప్పుడు ఆయనకు పోటీగా ‘సెవెంటీన్ ఇండస్ట్రీస్ ఇక్కడ...’ అంటూ మరొకరు వచ్చారు. ఎవరా అనుకొంటున్నారా? అనుష్క శెట్టి! దక్షిణాది రాష్ట్రాలలో స్టార్ హీరోలతో సమానంగా ప్రేక్షకాదరణ పొందుతున్న ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టి 17 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా చిన్న కేక్ మీద ఇంగ్లీషులో ‘సెవెంటీన్ ఇండస్ట్రీస్ ఇక్కడ’ అని వ్రాయించి ఆ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకొంటూ, “ఈ 17 ఏళ్ళలో సినీ ఇండస్ట్రీ, నా ఫ్యామిలీ, ప్రేక్షకులు అందరి నుంచి ఎంతో మద్దతు, ప్రేమాభిమానాలు పొందాను. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను,” అంటూ అనుష్క ట్వీట్ చేశారు. ఆమె ఏమన్నారో ఆమె మాటలలోనే...  


ప్రస్తుతం అనుష్క నవీన్ పోలిశెట్టితో ఓ సినిమా చేస్తున్నారు. మూడేళ్ళ గ్యాప్ తరువాత ఆ సినిమా షూటింగులోనే ఆమె పాల్గొన్నప్పుడు ట్విట్టర్‌ ద్వారా అభిమానులను ఈవిదంగా పలకరించి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.