
బ్రహ్మోత్సవం ఫ్లాప్ తర్వాత మహేష్ అభిమానులకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు. బర్త్ డే నాడు కూడా తన ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన మహేష్ దసరాకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వకుండా షాక్ ఇచ్చాడు అయితే దీపావళికి ఇవ్వకపోతే బాగోదు అనుకున్నాడో ఏమో అందుకే దీవాళ్లికి ఫ్యాన్స్ కు తన స్పెషల్ గిఫ్ట్ రెడీ చేస్తున్నాడట మహేష్. ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ గా ఓ ప్రోమో రీసెంట్ గా షూట్ చేశారట అంతేకాదు దానితో పాటుగా ఈ సినిమా టైటిల్ కూడా దీవాళికి రివీల్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది.
మహేష్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దాదాపు రెండు నెలల నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 40 శాతం వరకు పూర్తి చేసుకుందట.
అవుట్ పుట్ మీద పూర్తి నమ్మకంతో ఉన్న మహేష్ సినిమా కచ్చితంగా ఓ బ్లాక్ బస్టర్ అవుతుందని తన సన్నిహితులతో చెబుతున్నాడట. అంతేకాదు ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న మురుగదాస్ ఈ సినిమాతో మరోసారి తన ప్రతిభ చాటాలని చూస్తున్నాడు. వచ్చే సమ్మర్ టార్గెట్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి కల్లా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.