కాఫీ విత్ కరణ్ షోలో అక్షయ్ కుమార్‌, సమంత డ్యాన్స్

డిస్నీ +హాట్ స్టార్ ఛానల్లో చాలా పాపులర్ ‘కాఫీ విత్ కరణ్’ షో సీజన్-7లో ఈసారి సమంత సందడి చేయబోతోంది. ఆ షో ప్రొమోలో పాల్గొనేందుకు వచ్చిన సమంతను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌ హటాత్తుగా చేతుల్లోకి ఎత్తుకొని స్టేజి మీదకు తీసుకురావడంతో ఆ షో హోస్ట్ కరణ్ కూడా ఆశ్చర్యపోతాడు. వెంటనే తేరుకొని నంబర్ వన్ హీరో చేతుల్లో నంబర్ హీరోయిన్‌ వచ్చింది," అంటూ ఇద్దరినీ ప్రశంశించాడు. 

ఈ షోలో కరణ్ అతిధులుగా వచ్చే నటీనటులు, సినీ ప్రముఖులని ప్రశ్నలు అడుగుతూ హుషారుగా నిర్వహిస్తుంటాడు. అలాగే ఈ షోలో సమంతను “అన్ హ్యాపీ మేరేజ్..”అంటూ నాగ చైతన్యతో విడిపోవడంపై ప్రశ్న సందించగా సమంత కూడా ఏ మాత్రం తడబడకుండా “అన్నిటికీ కారణం నువ్వే...” అంటూ ఇబ్బందికరమైన ఆ ప్రశ్నకు తెలివిగా జవాబు దాటవేసింది. అయితే ఇది ప్రమో కనుక ఈవిషయంపై సమంత ఏమి చెప్పిందో తెలియాలంటే గురువారం రాత్రి 7 గంటలకు ఈ షో ప్రసారం అయ్యేవరకు వేచి చూడాల్సిందే.

ఒకవేళ బ్యాచిలర్ పార్టీ ఇస్తే నువ్వు ఏ ఇద్దరు బాలీవుడ్ హీరోలను నీతో డ్యాన్స్ చేయడానికి ఆహ్వానిస్తావు? అని ప్రశ్నిస్తే రణవీర్ సింగ్ మరియు రణవీర్ సింగ్ అని జవాబు చెప్పి అతని డ్యాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని తెలియజేసింది. తరువాత అక్షయ్ సమంత ఇద్దరూ డ్యాన్స్ చేసి అలరించారు.