
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా చేస్తున్న చిత్రం సలార్. 2021, జనవరిలో సలార్ షూటింగ్ గోదావరిఖనిలో ప్రారంభించారు. మద్యలో అనేక అవాంతరాలతో షూటింగ్ ఆలస్యమైంది. ఎట్టకేలకు సలార్ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలో చివరి షెడ్యూల్ ప్రారంభించి ఓ లోయ బ్యాక్ డ్రాప్లో భారీ యాక్షన్ సీన్, కొన్ని ఛేజింగ్ సీన్స్‌తో షూటింగ్ పూర్తవుతుందని సమాచారం.
రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న సలార్ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, ఈశ్వరీ రావు, మధు గురుస్వామి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కెమెరా: భువనగౌడ, సంగీతం: రవి బస్రూర్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సలార్ విడుదలయ్యే అవకాశం ఉంది.