పెళ్ళి తరువాత నయనతారలో తొలి మార్పు!

నయనతార వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ సినీ పరిశ్రమలో తనకు తిరుగేలేదు. ఇటీవల తన ప్రేమికుడు, కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్‌ను వివాహం చేసుకొన్నాక ఆమె వ్యక్తిగత జీవితం కూడా గాడినపడినట్లే ఉంది. అయితే ఇప్పుడు ఆమె సినీ కెరీర్ ఏవిదంగా సాగుతుందనే సందేహం ఉండేది. ఎందుకంటే పెళ్ళి తరువాత ఇండస్ట్రీలో హీరోయిన్లకు డిమాండ్ తగ్గుతుంది. కానీ నయనతార, సమంత వంటి కొందరు హీరోయిన్లకు మాత్రం అది తమకు వర్తించదని నిరూపిస్తున్నారు. పెళ్ళి తరువాతే ఆమె బాలీవుడ్‌లో ప్రవేశించబోతున్నారు. తొలిచిత్రంలోనే బాలీవుడ్‌ బాదుషా షారూఖ్ ఖాన్‌తో కలిసి నటించబోతున్నారు.

నయనతార పెళ్ళి తరువాత తన పారితోషికాన్ని ఒకేసారి రూ.4 కోట్లు పెంచేసినట్లు తెలుస్తోంది. ఇదివరకు ఆమె ఒక్కో సినిమాకు రూ.6 కోట్లు తీసుకొంటుంటే, ఇప్పుడు రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఆమె నటిస్తే సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని, కలెక్షన్ల కనక వర్షం కురుస్తాయని దర్శక, నిర్మాతల గట్టి నమ్మకం. అందుకే ఆమె అడిగినంతా ముట్టజెప్పి ఆమె చేత సినిమాకి సంతకం పెట్టించుకొనేందుకు నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు.