
సమంత ప్రధాన పాత్రలో వస్తున్న యశోద చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే అది కూడా పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నట్లు నిర్మాత శివలెంక ప్రసాద్ తెలిపారు. యశోదలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, కల్పిక గణేశ్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ, మధురిమ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కాబోతోంది.
ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హరి, హరీష్ దర్శకత్వం వహిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
కెమెరా: ఎం.సుకుమార్, ఎడిటింగ్: మార్తాండ్ క్ వెంకటేష్, పాటలు: రామజోగయ్య శాస్త్రి
సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం, హాలీవుడ్ మూవీ ‘ఆరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ అనే మరో రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.