
ప్రముఖ నటుడు ప్రతాప్ పోతన్ (70) గురువారం రాత్రి చెన్నైలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. చిన్నప్పటి నుంచే నటనపై మక్కువ కలిగిన ఆయన ఆరవం అనే మలయాళ సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తరువాత తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో వందకు పైగా సినిమాలలో నటించారు. తెలుగులో ఆకలిరాజ్యం, కాంచన గంగా, మరో చరిత్ర, జస్టిస్ చక్రవర్తి, వీడెవడు, చుక్కల్లో చంద్రుడు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించారు. ప్రతాప్ పోతన్ కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా చేశారు. తెలుగులో చైతన్య అనే సినిమాకు దర్శకత్వం వహించారు. 1985లో నటి రాధికను వివాహం చేసుకొన్నారు కానీ వారి మద్య విభేదాలు తలెత్తడంతో ఏడాదిలోనే విడిపోయారు.