
విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య, రాశీ ఖన్నా, మాళవికా నాయర్ ప్రధాన పాత్రలలో నటించిన థాంక్ యు చిత్రం జులై 22న విడుదల కాబోతోంది. కనుక ఈరోజు థాంక్ యు ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. “మనం ఎక్కడ మొదలయ్యామో మరిచిపోతే... మనం చేరిన గమ్యానికి విలువ ఉండదని నా ఫ్రెండ్ చెప్పాడు... అంటూ నాగ చైతన్య వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ మొదలవుతుంది. మద్యలో నాగ చైతన్య యాక్షన్ సీన్స్, డైలాగ్స్ చాలా ఆకట్టుకొనేలా ఉన్నాయి.
శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ చక్కటి సంగీతం అందించారు. అక్కినేని కుటుంబానికి మనం వంటి సూపర్ హిట్ అందించిన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.