సోనీ లివ్‌లో ఎఫ్-3 ఎప్పటి నుంచి అంటే..

వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, సునీల్, సోనాల్‌చౌహ‌న్‌, అలీ తదితరులు ప్రధాన పాత్రలలో చేసిన ఎఫ్-2 చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఎఫ్-3 ప్రేక్షకులను బాగానే రంజింపజేసింది. సినిమా మొదటి నుంచి చివరి వరకు కడుపుబ్బ నవ్వించేవిదంగా సాగిపోవడంతో మే 27న విడుదలైన ఈ సినిమా ఇంతవరకు థియేటర్లలోనే నిలబడగలిగింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను రంజింపజేసేందుకు వచ్చేస్తోంది ఎఫ్-3. ఈ నెల 22 నుంచి సోనీ లివ్‌లో ఎఫ్-3 ప్రసారం కాబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీశ్ నిర్మించారు. ఎఫ్-3కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.