ఈ వారం విడుదలయ్యే సినిమాలు, వెబ్‌ సిరీస్‌ ఇవే..

ఈ వారం కూడా వివిద భాషలలో కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌ థియేటర్లలో, ఓటీటీలలో విడుదలకాబోతున్నాయి. 

థియేటర్లలో విడుదలకాబోతున్న చిత్రాలు: 

ది వారియర్: లింగుస్వామి దర్శకత్వంలో రామ్, కృతిశెట్టి. ఆదిపినిశెట్టి, అక్షరాగౌడ ప్రధాన పాత్రలతో రూపొందిన ఈ సినిమా గురువారం విడుదల కాబోతోంది. 

గార్గి: వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో సాయి పల్లవి, కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాకు గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది. 

హిట్: ది ఫస్ట్ కేస్ సబ్ టైటిల్‌తో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా కూడా ఈ శుక్రవారమే విడుదల కాబోతోంది. ఈ సినిమాకు శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ రావు, సాన్య మల్హోత్రా, దాలీప్ తహిల్, శిల్ప శుక్ల తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు.

మై డియర్ భూతం: మళ్ళీ చాలారోజుల తరువాత ప్రభుదేవా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వస్తున్నారు. ఎస్.రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభుదేవా, రమ్యా నంబీశన్, మాస్టర్ సాత్విక్ ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది. 

ఓటీటీలో విడుదలకాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌ ఇవే: 

సమ్మతమే: గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరీ, గోపరాజు రమణ, సప్తగిరి తదిరులు నటించిన ఈ సినిమా ఆహా ఓటీటీలో శుక్రవారం నుంచి ప్రసారం కానుంది. 

మా నీళ్ళ ట్యాంక్: ఈ తెలుగు వెబ్‌ సిరీస్‌ శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో ప్రసారం కానుంది. దీనిలో సుశాంత్, ప్రియా ఆనంద్, సుదర్శన్, ప్రేమ్ సాగర్, నీరోషా తదితరులు నటించారు.  దర్శకత్వం: లక్ష్మీ సౌజన్య.        

వాషి: కీర్తి సురేశ్, తోవినో థామస్ ప్రధానపాత్రలలో రూపొందిన ఈ మలయాళ చిత్రానికి తెలుగు వెర్షన్ ఈ శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. దర్శకత్వం: విష్ణు జి. రాఘవ. 

ఈరోజు నుంచి మదరింగ్ సండే (ఇంగ్లీష్ చిత్రం) శుక్రవారం నుంచి జన్‌హిత్ మే జారీ (హిందీ చిత్రం) జీ5లో ప్రసారం కానున్నాయి.