కోలీవుడ్ నటుడు చియాన్ విక్రమ్ ఇటీవల అస్వస్థతకు గురై చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. మొన్న శనివారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆయన హాస్పిటల్‌లో చేరడంతో ఆయనకు గుండె పోటు వచ్చిందని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ విక్రమ్‌కు గుండెపోటు రాలేదని వైద్యులు, ఆయన కుమారుడు ధృవ్ స్పష్టం చేశారు. ఐసీయులో రెండు రోజులు చికిత్స పొంది పూర్తిగా కోలుకొన్న తరువాత ఈరోజు విక్రమ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలియజేస్తూ, తనపై ఇంత ప్రేమాభిమానాలు చూపిన అందరికీ కృతజ్ఞతలని విక్రమ్ సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టారు.
విక్రమ్ నటించిన పోన్నియన్ సెల్వన్ అనే తమిళ్ సినిమా టీజర్ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు విడుదలైంది. ఆ కార్యక్రమంలో విక్రమ్ పాల్గొనవలసి ఉండగా ఆసుపత్రి పాలయ్యారు.