
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా మొదలుపెట్టబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియెషన్స్ సంస్థ ఈరోజు ఆ సినిమా గురించి ఓ తాజా అప్‌డేట్ ఇచ్చింది. మహేష్ బాబు 28వ చిత్రంగా రూపొందబోతున్న ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని ఆగస్ట్ నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతోందని తెలియజేసింది.
ఈ సినిమాలో పూజా హెగ్డే మహేష్ బాబుకు జోడీగా నటించబోతోంది. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం చేస్తున్న తమన్ ఈరోజు తెల్లవారుజాము నుంచే పని మొదలుపెట్టానని ట్వీట్ చేశారు. ఆగస్ట్ నెలలో షూటింగ్ ప్రారంభిస్తే అది పూర్తయీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవడానికి కనీసం 4-5 నెలలు పడుతుంది. కనుక వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగకు ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.