నాగ చైతన్య దూత వెబ్‌ సిరీస్‌

సినీ పరిశ్రమకు ఓటీటీలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని నిర్మాతల మండలి భావిస్తుంటే, స్టార్ హీరోలందరూ ఓటీటీలలో ప్రసారం అయ్యే వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు క్యూ కడుతుండటం విశేషం. ఆ జాబితాలో నాగ చైతన్య కూడా చేరారు. ‘అక్కినేని ఫ్యామిలీ ఫోటో’ అని చెప్పుకోదగ్గ ‘మనం’ వంటి సూపర్ హిట్ సినిమా అందించిన దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఈ వెబ్‌ సిరీస్‌కు దర్శకత్వం వహించబోతున్నారు. అమెజాన్ ప్రైమ్‌ కోసం తెలుగు, తమిళ్ భాషలలో నిర్మించబోతున్న ఈ వెబ్‌ సిరీస్‌కు దూత అని పేరు పెట్టారు. దీనిలో నాగ చైతన్యకు జోడీగా మలయాళీ భామలు భవానీ శంకర్, పార్వతి నటిస్తున్నారు. థ్రిల్లర్ జోనర్‌లో రూపొందబోతున్న దూతలో నాగ చైతన్య నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దీనిని దీపావళి పండుగ సీజనులో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.