
కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరీ జంటగా నటించిన సమ్మతమే చిత్రం జూన్ 24న థియేటర్లలో విడుదలై పర్వాలేదనిపించుకొంది. అటువంటి సినిమాలు రెండు వారాలలోగానే ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి కనుక సమ్మతమే కూడా ఆహా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఆహాలో ప్రసారం కాబోతోంది. దాని కంటే ముందు ‘జై భజరంగీ’ చిత్రం రేపటి నుంచే ఆహాలో ప్రసారం కాబోతోంది.
గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన సమ్మతమే చిత్రాన్ని యుజి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కనకాల ప్రవీణ నిర్మించారు.
కన్నడ నటుడు శివరాజ్ కుమార్ హీరోగా నటించిన జై భజరంగీ-2 అదే పేరుతో 2013లో వచ్చిన చిత్రానికి సీక్వెల్‌గా తీశారు. దీని తెలుగు వెర్షన్ రేపటి నుంచి ఆహాలో ప్రసారం కాబోతోంది.