ప్రముఖ నిర్మాత గోరంట్ల మృతి

తెలుగు సినీ పరిశ్రమలో 24 గంటల వ్యవధిలో మరో విషాదం చోటు చేసుకొంది. మంగళవారం రాత్రి ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు మృతి చెందగా, ఈరోజు ఉదయం ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ (86) హైదరాబాద్‌లో తన నివాసంలో కన్ను మూశారు. ఆయన గత కొంతకాలంగా వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. 

గోరంట్ల ప్రసాద్ మాధవి పిక్చర్స్ సంస్థను స్థాపించి ఆ బ్యానర్‌పై అనేక సూపర్ హిట్ సినిమాలు తీశారు. సుపుత్రుడు, దొరబాబు, కురుక్షేత్రం, ఆటగాడు వంటి అనేక సూపర్ హిట్ సినిమాలు తీశారు. ప్రముఖ నిర్మాత రామానాయుడితో కలిసి సహ నిర్మాతగా అనేక సినిమాలు తీశారు. 

గోరంట్ల మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.