
మాస్ మహారాజ రవితేజ డెప్యూటీ కలెక్టర్‌గా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ ఈ నెల 29వ తేదీన విడుదల కాబోతోంది. కనుక సినిమా ప్రమోషన్స్ జోరుగా మొదలయ్యాయి. ఇటీవల నాపేరు సీసా అంటూ అన్వేషి జైన్ మంచి హుషారుగా చేసిన ఐటెమ్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఒకప్పుడు వరుసపెట్టి సినిమాలు చేసిన వేణు ఆ తరువాత 11 ఏళ్ళపాటు కనబడలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో వేణు పోలీస్ ఆఫీసర్‌గా చేసినట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా అర్దమవుతోంది. అయితే నిజాయితీ కలిగిన ఆఫీసరుగా చేశారా లేక నెగెటివ్ రోల్ చేశారా అనేది సినిమా చూస్తే గానీ తెలియదు.
నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వస్తున్న రామారావు ఆన్ డ్యూటీలో రవితేజకు జోడీగా రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, నాజర్, నరేశ్, వేణు తొట్టెంపూడి, రాహుల్ రామకృష్ణ, ప్రవిత్ర లోకేష్, చైతన్య కృష్ణ, సురేఖ వాణి తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు.
శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్, ఆర్‌టి టీం వర్క్స్ బ్యానర్‌లలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. రామారావు ఆన్ డ్యూటీ చిత్రానికి కెమెరా సత్యన్ సూర్యన్, సంగీతం శామ్ సిఎస్ అందించారు.