సినీ ఎడిటర్ గౌతమ్ రాజు మృతి

ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతంరాజు (69) మంగళవారం అర్దరాత్రి హైదరాబాద్‌లో తన నివాసంలో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.     

చట్టానికి కళ్ళు లేవు సినిమాతో ఎడిటర్‌గా తన ప్రస్థానం ప్రారంభించిన గౌతంరాజు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 850కి పైగా సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు. ఆయన తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు అందరూ ప్రముఖ హీరోల చిత్రాలకు ఎడిటర్‌గా చేశారు. ఆయన ఎడిటింగ్ చేసిన చిత్రాలలో నాలుగు స్తంభాలత, దళపతి,  అసెంబ్లీ రౌడీ, ఆది, అదుర్స్, కిక్, బలుపు, బద్రీనాథ్, గోపాలా గోపాలా, గబ్బర్ సింగ్, కాటమరాయుడు, ఖైదీ నంబర్ 150, రేసు గుర్రం, రచ్చ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ తదితర అనేక సూపర్ హిట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆది చిత్రానికి ఉత్తమ ఎడిటర్ అవార్డు అందుకొన్నారు. 

గౌతంరాజు మృతి పట్ల దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.