ఈ నెల 7,8 తేదీలలో వివిద భాషలకు చెందిన 9 సినిమాలు విడుదల కాబోతున్నాయి. జూలై 7వ తేదీన ధోర్ లవ్ అండ్ థండర్ (ఇంగ్లీషు చిత్రం తెలుగు డబ్బింగ్), జూలై 8న హ్యాపీ బర్త్ డే (తెలుగు), గంధర్వ (తెలుగు), రుద్రసింహ (తెలుగు), మా నాన్న నక్సలైట్ (తెలుగు), కొండవీరుడు (తెలుగు), ఖుదా హఫీజ్ (హిందీ) థియేటర్లలో విడుదల కాబోతున్నాయి.
ఇక ఈవారం ఓటీటీలో కూడా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ విడుదల కాబోతున్నాయి. కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ (తెలుగు వెర్షన్) జూలై 8న డిస్నీ+ హాట్ స్టార్‌లో విడుదలకాబోతోంది. జూలై 8 నుంచి మోడర్న్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కాబోతోంది. అదే రోజున ఆహా ఓటీటీలో జై భజరంగీ తెలుగు సినిమా విడుదల కాబోతోంది. జూలై 10వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో నాని, నజ్రియా జంటగా నటించి అంటే సుందరానికి ప్రసారం కాబోతోంది. ఇవి కాక ఇంకా హిందీ, తదితర భాషలలో వివిద ఓటీటీలలో కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ విడుదలకానున్నాయి.