కోలీవుడ్ నటుడు విశాల్ మళ్ళీ షూటింగులో గాయపడ్డాడు. ఆయన హీరోగా చేస్తున్న లాఠీ సినిమాలో ఆదివారం ఓ క్లైమాక్స్ ఫైటింగ్ సీన్ షూటింగు జరుగుతుండగా కుడిచేతికి గాయమైంది. వెంటనే షూటింగ్ నిలిపివేసి ఆయనకు స్పాట్‌లోనే ప్రాదమిక చికిత్స చేసి హాస్పిటల్‌కు తరలించారు.
ఆయన చేతికి ఎక్స్‌రే తీసి పరీక్షించిన వైద్యులు ఫ్రాక్చర్ కాలేదని స్పష్టం చేశారు. త్వరలో గాయం నయమవుతుంది కానీ ఆ చేతికి ఎక్కువ ఒత్తిడి ఇవ్వకూడదని, రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకొంటే మంచిదని సూచించారు. వైద్యుల సూచన మేరకు విశాల్ కోలుకొనేవరకు లాఠీ సినిమా షూటింగ్ నిలిపివేస్తున్నామని దర్శక నిర్మాతలు ప్రకటించారు.
ఈ యాక్షన్ ప్యాక్డ్ సినిమా కోసం విశాల్ చాలా రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగులో విశాల్ రెండు మూడుసార్లు గాయపడ్డారు. ఇప్పుడు మరోసారి గాయపడ్డారు.
వినోద్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా సునైన నటిస్తోంది. ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కాబోతోంది.