నెట్‌ఫ్లిక్స్‌లో అంటే సుందరానికి...

నేచురల్ స్టార్ నానీ, నజ్రియా నజీమ్ జంటగా నటించిన అంటే సుందరానికి జూన్‌ 10న థియేటర్లలో విడుదలైంది. సినిమా... కామెడీ, నాని నటన అన్ని బాగానే ఉన్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం ఆశించినస్థాయిలో రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా జూలై 10వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకాబోతోంది. ఈ విషయం నెట్‌ఫ్లిక్స్‌ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. “సుందర్, లీలా వివాహ కథను తిలకించేందుకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జూలై 10వ తేదీని సేవ్ చేసుకోండి.. అంటే సుందరానికి తెలుగు, మలయాళం, తమిళ్ వెర్షన్స్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తున్నాం,” అని ప్రకటించింది. 

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన అంటే సుందరానికి మైత్రీ మూవీమేకర్స్ నిర్మించింది. ఈ సినిమాలో నరేష్, తులసి, యల్బీ శ్రీరామ్, హర్షవర్ధన్, శ్రీకాంత్, పృధ్వీరాజ్, అయ్యంగార్, పవిత్రా లోకేశ్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు.