అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ చిత్రం జూన్ 3వ తేదీన థియేటర్లలో విడుదలై ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి కూడా ప్రశంశలు అందుకొంది. ఈ సినిమా జూలై 3వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతోంది. తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.
26/11 ముంబై ఉగ్రదాడులలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కధ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. మేజర్ ఉన్ని కృష్ణన్ సైన్యంలో చేరే ముందు ఏవిదంగా జీవితం గడిపారు? సైన్యంలో ఎందుకు చేరాలనుకొన్నారు? ముంబై ఉగ్రదాడుల సందర్భంగా మేజర్ ఉన్ని కృష్ణన్ ప్రాణాలకు తెగించి వారిని ఏవిదంగా ఎదుర్కొన్నారు? అనేది ఈ సినిమాలో చూపించారు దర్శకుడు శశికిరణ్ తిక్క. ఈ సినిమాలో మేజర్ ఉన్ని కృష్ణన్ తల్లితండ్రులుగా రేవతి, ప్రకాష్ రాజ్ నటించారు. థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన మేజర్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా అలరించనుంది.