పరీక్షలున్నాయి.. అందుకే అందాలపోటీకి డుమ్మా

డాక్టర్ రాజశేఖర్ జీవిత దంపతుల కుమార్తె, నటి శివాని తమిళనాడు రాష్ట్రం నుంచి మిస్ ఇండియా అందాలపోటీకి ఎంపికయ్యింది. అయితే వాటికి హాజరుకావడం లేదని ట్విట్టర్‌లో తెలియజేసింది. “నాకు ఇటీవల మలేరియా జ్వరం రావడం వలన అందాలపోటీలో ట్రైనింగ్, గ్రూమింగ్ సెషన్స్, సబ్ కాంటెస్ట్ లలో పాల్గొనలేకపోయాను. అదీగాక నాకు మెడికల్ థియరీ పరీక్షలున్నాయి. నా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనుకొన్న సమయం కంటే ముందుగా మొదలయ్యాయి. మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే జరిగే రోజున అంటే జూలై 3వ తేదీన నాకు ఎగ్జామ్ ఉంది. కనుక ఈ మిస్ ఇండియా అందాల పోటీ నుంచి తప్పుకొంటున్నాను. ఇప్పటివరకు నాకు సహకరించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” శివాని ట్వీట్ చేసింది. 

శివాని ప్రస్తుతం ఎంబీబీఎస్ నాలుగవ సంవత్సరం పరీక్షలకు సిద్దం అవుతోంది. ఇటీవల విడుదలైన శేఖర్ సినిమాలో తన తండ్రి డాక్టర్ రాజశేఖర్‌తో కలిసి నటించి మెప్పించింది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు, తెలుగులో ఆహా నా పెళ్ళంట వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది.