నెట్‌ఫ్లిక్స్‌లో విరాటపర్వం ఎప్పటినుంచి అంటే...

రానా, సాయిపల్లవి జంటగా నటించిన విరాట పర్వం థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఓటిటీ ప్రేక్షకులను కూడా అలరించేందుకు వచ్చేయబోతోంది. జూలై 1వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో విరాటపర్వం ప్రసారం కాబోతోంది. తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ట్విట్టర్‌లో ప్రకటించింది. 

వరంగల్‌లోని సరళ అనే యువతి ఓ నక్సలైట్‌తో ప్రేమలో పడి అతని కోసం అందరినీ విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ యాదార్ధగాధ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు వేణు ఊడుగుల తీయగా రానా, సాయి పల్లవి తమ అద్భుతమైన నటనతో దానికి ప్రాణం పోశారు. ఈ సినిమాలో ప్రియమణి, నందితాదాస్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు, నివేదా పేతురాజ్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ కలిసి ఈ సినిమాను నిర్మించాయి.