
నాగార్జున, కోలీవుడ్ హీరో కార్తి కలిసి ఊపిరి సినిమాలో నటించారు. ఇప్పుడు కార్తి హీరోగా చేస్తున్న సర్ధార్ సినిమా తెలుగు వెర్షన్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను నాగార్జునకు చెందిన అన్నపూర్ణా స్టూడియోస్ తీసుకొంది. కనుక సర్ధార్ తెలుగు వెర్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై తెలుగు రాష్ట్రాలలో విడుదలకానుంది.
పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ మూవీని తెలుగు, తమిళ్ భాషలలో ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకొని శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో కార్తికి జోడీగా రాశీ ఖన్నా నటిస్తోంది. ఈ సినిమాకు కెమెరా జార్జ్. సి.విలియమ్స్, సంగీతం జీవి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు.