జూన్‌ 17న కిరోసిన్ రిలీజ్

ఇప్పుడు కొత్తగా వస్తున్న దర్శకులు విలక్షణమైన కధాంశాలతో పాటు విలక్షణమైన సినిమా టైటిల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. అటువంటి సినిమా టైటిలే కిరోసిన్. సబ్ టైటిల్ ‘ద బర్న్‌ట్‌ ట్రూత్’ ఈ సినిమా కధ ఏమిటో చెపుతోంది. ఈ మర్డర్ మిస్టరీ చిత్రం ఈ నెల 17వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ధృవ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసరుగా నటించాడు. బిగ్‌ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి కొండేటి, పృధ్వీ యాదవ్ ఈ సినిమాను నిర్మించారు. దీనికి సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవలే విడుదల చేశారు. 

ఈ సినిమాలో ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూధన్ రావు, సమ్మెట గాంధీ, రామారావు జాగావ్, లావణ్య, జీవన్ కుమార్, మీసాల లక్ష్మణ్, లక్ష్మీకాంత్ దేవ్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.