ఉచితంగా సర్కారువారి పాట

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారువారి పాట చిత్రం మే 12న థియేటర్లలో, జూన్‌ 2 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. కానీ ఓటీటీలో కూడా సర్కారువారి పాట చూడాలంటే రూ.199 అద్దె చెల్లించాలి. కనుక ఉచితంగా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న అమెజాన్ ప్రైమ్‌ వినియోగదారులకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది. ఈ నెల 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌ వినియోగదారులు ఉచితంగా ఈ సినిమాను చూడవచ్చని ప్రకటించింది. అంటే మరో వారం రోజులు ఎదురుచూడాలన్న మాట. 

పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారువారి పాటపై మొదట భిన్నాభిప్రాయాలు వినిపించినప్పటికీ, ఆ తరువాత నిలకడగా కలెక్షన్స్ రాబట్టగలిగింది. సినిమా విడుదలై నెల రోజులు దాటింది కనుక ఇప్పుడు ఓటీటీలో ఉచితంగా చూసేందుకు అందుబాటులోకి రాబోతోంది.