బ్రహ్మాస్త్రకు చిరంజీవి వాయిస్ ఓవర్

బాలీవుడ్‌ నటులు రణదీప్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, మౌనీ రాయ్, సౌరవ్ గుర్జార్, ధృవ్ సెహగల్, టాలీవుడ్‌ నటుడు నాగార్జున తదితరులు నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. దీనిని తెలుగులో శివ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ కోసం మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ వీడియో క్లిప్పును చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న బ్రహ్మాస్త్ర చిత్రం మొదటి భాగం ట్రైలర్‌ జూన్‌ 15న, సినిమా సెప్టెంబర్ 9వ తేదీన విడుదలవుతోంది.   

ఈ సినిమాను రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో యష్ జోహార్, కరణ్ జోహార్, రణబీర్ కపూర్, ఆయన్ ముఖ్యర్జీ, అపూర్వ మెహతా, నామిత్ మల్హోత్ర, ఎం.డిసౌజాలు వాల్ట్ డిస్నీ స్టూడియోస్, మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. 2018 నుంచి 2022 వరకు బల్గేరియా, లండన్, న్యూయార్క్‌, ఎడిన్ బర్గ్, వారణాసిలలో షూటింగ్ చేస్తున్నారు. మద్యలో కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమైంది.  

బ్రహ్మాస్త్ర తెలుగు వెర్షన్‌కు చిరంజీవి వాయిస్ ఓవర్ మీరూ విని అనదించండి.