భోళా శంకర్ అప్‌డేట్ వచ్చేసింది

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన భోళా శంకర్ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ సినిమాకు సంబందించి మరో తాజా అప్‌తాజా అప్‌డేట్స్ వచ్చింది. జూన్‌ 21వ తేదీ నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించబోతునట్లు చిత్ర బృందం ట్విట్టర్‌లో ప్రకటించింది. “మెగా వైబ్రేషన్‌తో జూన్‌ 21 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాము,” అంటూ భోళా శంకర్ ఫస్ట్ లుక్‌ పోస్టరు వేశారు.  

భోళా శంకర్‌లో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి తెలుగు రీమేక్‌ భోళా శంకర్. ఇది చిరంజీవి సినీ కెరీర్‌లో 154వ చిత్రం. ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటిస్తోంది. 

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది దసరా, దీపావళి పండుగ సీజన్‌లో భోళా శంకర్ అభిమాన ప్రేక్షకుల మద్యకు వచ్చే అవకాశం ఉంది.