
ఓ పక్క బాహుబలి సినిమా రిలీజ్ కు సిద్ధం చేస్తున్న రాజమౌళికి పోటీగా ఓ పక్క తమిళ పరిశ్రమ నుండి కాష్మోరా సిద్ధమవుతుంటే మరో పక్క తెలుగులోనే గౌతమిపుత్ర శాతకర్ణిగా క్రిష్ తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. అయితే సినిమా టీజర్ రిలీజ్ అయిన నాటి నుండి రాజమౌళి సినిమా మీద ఇంకాస్త ఎక్కువ స్కోప్ పెట్టాడట అంతేకాదు శాతకర్ణి టీజర్ గురించి ప్రస్థావిస్తూ దానికి బాహుబలికి అసలు సంబంధం లేదు అన్నట్టు తన సన్నిహితులతో మాట్లాడాడట.
ఈ మాటలు విన్న బాలయ్య ఫ్యాన్స్ కాస్త ఆగ్రహంగా ఉన్నారు. అంతేకాదు టీజర్ గురించి జక్కన్న ట్వీట్ చేయకపోవడం కూడా వారు తప్పు పడుతున్నారు. ఏ చిన్న టీజర్ అయినా సరే తనకు నచ్చితే రెస్పాన్స్ ఇచ్చే రాజమౌళి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా టీజర్ పట్ల తన రెస్పాన్స్ ఇవ్వకపోవడం కాస్త ఆశ్చర్యకరంగా ఉంది. రాజమౌళి ఏమి అనకపోయినా తప్పే అన్నట్టు మీడియా ప్రవర్తిస్తుంది.