
నయనతార, విఘ్నేశ్ శివన్‌లు ఎల్లుండి అంటే గురువారం పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారు. వారిద్దరూ కలిసి ప్రముఖులకు తమ పెళ్ళి శుభలేఖలు పంచుతున్న ఫోటోలు మీడియాలో వస్తుండటంతో విఘ్నేశ్ శివన్ స్పందిస్తూ, “అవును. నేను నా ప్రేయసి నయనతారను పెళ్ళి చేసుకోబోతున్నాను. జూన్ 9వ తేదీ ఉదయం మహాబలిపురంలో మా ఇరువురి కుటుంబాలతో పాటు కొందరు సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో మా పెళ్ళి జరుగుతుంది. ముందు తిరుపతిలో పెళ్ళి చేసుకోవాలనుకొన్నాము కానీ అక్కడకి అందరూ చేరుకోవడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయని మహాబలిపురంలో పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకొన్నాము. మా పెళ్ళి కార్యక్రమం పూర్తవగానే మా పెళ్ళి ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకొంటాము. జూన్ 11న నేను, నయన్ మీ అందరినీ ప్రత్యేకంగా కలుస్తాము. వృత్తిపరంగానే కాక ఇకపై వ్యక్తిగతంగా కూడా మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలని నేను కోరుకొంటున్నాను,” అని విఘ్నేశ్ శివన్ చెప్పారు.