పెళ్ళి శుభలేఖలు పంచుతున్న నయన్, శివన్

ప్రముఖ నటి నయనతార, కోలీవుడ్ దర్శకుడు విగ్నేశ్‌ శివన్ ఈ నెల 9వ తేదీన పెళ్ళి చేసుకోబోతున్నారు. వారిరువురూ నిన్న చెన్నైలోని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధికార నివాసానికి వెళ్ళి శుభలేఖ ఇచ్చి తమ పెళ్ళికి ఆహ్వానించారు. 

మొదట వారు తిరుమలలో పెళ్ళి చేసుకోవాలని భావించారు కానీ ఇప్పుడు మహాబలిపురంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పెళ్ళి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వారు తమ వివాహానికి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలతో పాటు బాలీవుడ్‌ ప్రముఖులను కూడా ఆహ్వానించారు. 

అనేక ఏళ్ళుగా సహజీవనం చేస్తున్న నయనతార, విగ్నేశ్‌ శివన్‌లు సమాజం కోసమే వివాహం చేసుకొంటున్నారని చెప్పవచ్చు. అయితే ఇంతవరకు సజావుగా సాగినా వారి వైవాహిక జీవితంలో తీవ్ర ఒడిదుకులకు లోనవుతాయని చివరికి విడిపోయే అవకాశం కూడా ఉందని ప్రముఖ జోస్యుడు వేణు జోస్యం తెలిపారు. 

సమంత, నాగ చైతన్యలు వివాహం చేసుకొన్నప్పుడు వారి జాతకాలను పరిశీలించిన ఆయన వారు ఎక్కువ కాలం కలిసి ఉండలేరని విడిపోతారని చెప్పారు. చివరికి ఆయన చెప్పినట్లుగానే సమంత, నాగ చైతన్య విడిపోయారు. కనుక నయన్, శివన్‌లు కలకాలం కాపురం చేసుకొంటూ ఆయన జోస్యం తప్పని నిరూపిస్తారని ఆశిద్దాం.