తెలుగు సినీ నటుడు సత్య మృతి

తెలుగు సినీ పరిశ్రమలో వారం, బ్యాచిలర్స్ అనే రెండు సినిమాల అనుభవం గల యువ నటుడు సత్య ఈరోజు గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి చెందాడు. అతని పూర్తి పేరు వి.రామసత్యనారాయణ. చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో సినిమాలకు స్వస్తి పలికి వ్యాపారం చేసుకొంటుండగా గత ఏడాది కరోనా సోకి సత్య తల్లి, భార్య ఇద్దరూ చనిపోయారు. అప్పటి నుంచి తీవ్ర మనోవ్యధతో కుమిలిపోతున్న సత్య ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకొంటున్నాడు. కానీ మానసికంగా చాలా క్షోభ అనుభవిస్తుండటంతో గుండెపోటుతో చనిపోయాడు. సత్యకు 8 ఏళ్ళు వయసున్న ఓ కుమార్తె ఉంది. ఆ పసి వయసులోనే తల్లితండ్రులు ఇద్దరూ చనిపోవడం చాలా బాధాకరం.