రామ్-బోయపాటి సినిమా షూటింగ్ ప్రారంభం

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి మాస్ హీరోగా పేరు సంపాదించుకొన్న రామ్ పోతినేని, కమర్షియల్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమాకు నేడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరిగింది. రామ్ 20వ చిత్రమైన దీనిని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని దర్శకుడు బోయపాటి చెప్పారు. 

“మీ అందరి ప్రేమ, ఆశీర్వాదంతో మరో కొత్త ప్రారంభం’ అంటూ రామ్ ట్విట్టర్‌ ద్వారా తన కొత్త సినిమా ప్రారంభమైనట్లు తెలిపారు.