కెకెగా దేశప్రజలకు సుపరిచితుడైన ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ (53) మంగళవారం రాత్రి కోల్‌కతాలో మరణించారు. అంతకు ముందు ఆయన కోల్‌కతా నగరంలో నజూరుల్ మంచా ఆడిటోరియంలో తన పాటలతో అభిమానులను ఉర్రూతలూగించారు. అక్కడ ప్రదర్శన ముగిసిన తరువాత తాను బస చేసిన హోటల్ గదికి చేరుకొని, తన తాజా షో తాలూకా ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా హటాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సిఎంఆర్ఈ హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించారని వైద్యులు స్పష్టం చేశారు.
ఢిల్లీకి చెందిన కెకె 1999లో పాల్ అనే సినిమాతో బాలీవుడ్‌లో ప్రవేశించారు. అప్పటి నుంచి ఆయన హిందీతో సహా బెంగాలీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం తదితర భాషల్లో వేలాదిపాటలు పాడి యావత్ దేశ ప్రజలను ఆకట్టుకొన్నారు. ఆయన మృతిపట్ల ప్రధాని నరేంద్రమోడీ, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ తదితరులు సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.