
దగ్గుపాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో రూపొందిన విరాటపర్వం సినిమా పూర్తయి చాలాకాలమే అయ్యింది. గత ఏడాదే ఈ సినిమా విడుదల కావలసి ఉండగా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ చివరికి ఈ ఏడాది జూలై 1న విడుదలకి సిద్దం అయ్యింది. అయితే ఇప్పుడు మరికాస్త ముందుగా అంటే జూన్ 17వ తేదీనే విరాటపర్వం విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆ చిత్ర బృందం ప్రకటించింది.
తెలంగాణలో 1990 దశకంలో నక్సల్ ఉద్యమాలు జోరుగా సాగుతుండేవి. వాటి నేపధ్యంలో పీరియాడికల్ మూవీగా దీనిని నిర్మించారు. ఈ సినిమాలో కామ్రేడ్ రవన్నగా రానా, వెన్నెలగా సాయి పల్లవి నటించారు. ప్రియమణి, నందితాదాస్, జారీనా వాహేబ్, ఈశ్వరీ రావు, సాయి చంద్, నివేద పేతురాజ్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ప్రముఖ నిర్మాతలు డి.సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి కలిసి సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాకు కధ, దర్శకత్వం వేణు ఉడుగుల, సంగీతం సురేశ్ బొబ్బిలి అందించారు.